దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని న్యూ ఇయ‌ర్ కంగ్రాట్స్

ఈ ఏడాది శాంతి, ఆనందంగా ఉండాలి

hellotelugu-PMModiWisshes

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌రం 2026 సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ శుభాభినంద‌న‌లు తెలిపారు. శాంతి, సామ‌ర‌స్యం, సౌభాగ్యంతో విల‌సిల్లాల‌ని కోరారు. ప్ర‌పంచ మార్కెట్ లో భార‌త దేశం ముందంజ‌లో ఉండాల‌ని, ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ ప‌రంగా మ‌రింత ఉన్న‌తిని సాధించాల‌ని కోరారు. పేద‌లు లేని స‌మాజం కోసం ప్ర‌య‌త్నం చేస్తామని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. శాంతి, ఆనందం కోసం తాను ప్రార్థించానని తెలిపారు. చూస్తూ ఉండ‌గానే గత ఏడాది 2025 ముగిసి పోయింద‌ని, చాలా విజ‌యాలు భార‌త్ కు ద‌క్కాయ‌ని ఈ సంద‌ర్బంగా మ‌రోసారి గుర్తు చేశారు. అంత‌రాలు లేని స‌మాజం త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. పేద‌లు లేని దేశం కోసం త‌మ ప్ర‌య‌త్న‌మ‌న్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా స్పందించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ నూత‌న సంవ‌త్స‌రం అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తెస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయత్నాలలో విజయం సాధించాలని, వారు చేసే ప్రతి పనిలో నెరవేరాలని తాను ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా దేశ ప్ర‌ధాన‌మంత్రితో పాటు లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, వాయ‌నాడు ఎంపీ ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షురాలు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులతో పాటు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుభాకాంక్ష‌లు తెలిపారు.

Exit mobile version