President Murmu : తిరుమల : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జానకీ దేవి, భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
President Murmu Visited Tirumala
అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారీ భద్రత మధ్య తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు సభ్యులు. అనంతరం ఆమెకు సాదర స్వాగతం పలికారు పూజారులు. అమ్మ వారికి పూజలు చేశారు రాష్ట్రపతి. అమ్మ వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అమ్మ వారిని దర్శించు కోవడం మరిచి పోలేనని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Also Read : DY CM Bhatti Vikramarka Important Update : క్రిటికల్ మినరల్స్ కమిటీలో సింగరేణి కంపెనీకి స్థానం



















