President Murmu : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రశాంతతకు నిలయం ప్రశాంతి నిలయం అని అన్నారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu). ఏపీలోని శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తిలో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది వేడుకలలో శనివారం పాల్గొని ప్రసంగించారు. సత్యసాయి బాబా ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవ, వ్యక్తిగత పరివర్తనతో అనుసంధనం చేశారని అన్నారు. లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణ కలిగించేలా చేశారని కొనియాడారు. ‘దేశం ముందు’ అనే స్ఫూర్తికి అనుగుణంగా జాతి నిర్మాణం అన్ని సంస్థల విధి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని విక్షిత్ భారత్‌గా మార్చాలనే తమ లక్ష్యాన్ని సాధించడంలో సత్యసాయి బాబా సహకారం అంతర్లీనంగా సహాయ పడుతుందని స్పష్టం చేశారు ముర్ము.
President Murmu Praises Sri Sathya Saibaba
మానవాళికి సేవ చేయడం దేవునికి సేవ అనే నమ్మకాన్ని సత్య సాయిబాబా ప్రచారం చేశారని అన్నారు. సత్యసాయి బాబా తన అనుచరులను ప్రజా సంక్షేమంతో ఆధ్యాత్మికతను జోడించారని పేర్కొన్నారు. ఆయన బోధనల కారణంగా అనేక దేశాలలో తన భక్తులు నిరుపేదలకు సేవ చేయడంలో మునిగి పోయారని ఇది ప్రతి ఒక్కరికీ స్పూర్తిని, స్వాంతనను కలిగిస్తుందని చెప్పారు ప్రెసిడెంట్. శ్రీ సత్యసాయి బాబా నిస్వార్థ సేవ ద్వారా నిస్వార్థ ప్రేమ అనే సందేశం ఇచ్చారని అన్నారు. శ్రీ సత్యసాయి సంస్థను సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ప్రేరేపిస్తోందని ప్రశంసించారు. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు, ఎప్పటికీ సహాయం చేయి, ఎవరినీ బాధ పెట్ట వద్దు అనే సాయి సందేశం శాశ్వతమైనదని అది ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్నారు ద్రౌపది ముర్ము.
Also Read : CM Chandrababu New Innovation : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయాలి



















