ఢిల్లీ : ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే యువత ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుందన్నారు రాష్ట్రపతి ముర్ము. 2047 నాటికి విక్షిత్ భారత్‌కు పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 15వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. బారత్ సర్కార్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని అ్రన్నారు. ఈ కీలక ఈ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణ, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆమె చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం ప్రధాన కల కేవలం ఎత్తైన భవనాలు లేదా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ద్వారా నెరవేరదన్నారు ముర్ము.
కానీ చివరి మెట్టుపై నిలబడి ఉన్న వ్యక్తికి కూడా సమాన అవకాశాలు అందేలా చూడడం, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి సౌకర్యం ఉన్న సమాజాన్ని నిర్మించడం ద్వారా నెరవేరుతుందని స్పష్టం చేశారు రాష్ట్రపతి. ఈ సంవత్సరం వివిధ విభాగాలలో మొత్తం 1,112 మంది విద్యార్థులకు (722 మంది గ్రాడ్యుయేట్లు, 303 మంది అండర్ గ్రాడ్యుయేట్లు , 78 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు) డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి. అత్యుత్తమ విద్యా నైపుణ్యానికి ఒక డి-లిట్, ఒక గౌరవ పిహెచ్‌డి, రెండు బంగారు , 16 వెండి పతకాలను కూడా ప్రదానం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. ఎన్ఐటీ వంటి సంస్థలలో చదువుకున్న ఇంజనీర్లు సాంకేతిక అభివృద్ధిని మానవ సంక్షేమానికి ఒక మార్గంగా మార్చే దేశ నిర్మాతల పాత్రను పోషించాలని ముర్ము అన్నారు.
















