Prashant Kishore : బీహార్ : జన్ సురక్ష్ పార్టీ ప్రెసిడెంట్, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చిట్ చాట్ సందర్బంగా మహాత్మా గాంధీ గురించి స్పందించారు. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? మహాత్మా గాంధీ లేదా సావర్కర్ అని అడిగిన ప్రశ్నకు సీరియస్ అయ్యారు. సావర్కర్ ఎక్కడ..? గాంధీ ఎక్కడ అని అన్నారు. ఆయనకు సావర్కర్ కు పోలిక తీసుకు రావడం సబబు కాదన్నారు. దీంతో యాంకర్ నోరు మూసుకున్నారు. ఇద్దరినీ ఒకే గాటన కట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి ప్రశ్న వేయడం పూర్తిగా మహాత్మా గాంధీని అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. యావత్ ప్రపంచం ఉన్నంత వరకు మహాత్ముడు బతికే ఉంటాడని చెప్పారు.
Prashant Kishore Shocking Comments
ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తను ప్రాణాలు కోల్పోయిన విషయం మరిచి పోతే ఎలా అని మండిపడ్డారు ప్రశాంత్ కిషోర్. చరిత్ర తెలుసు కోకుండా ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారంటూ ఫైర్ అయ్యారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. సావర్కర్ జీవితం వేరు గాంధీ జీవితం వేరు. రాజకీయ లబ్ది పొందాలని అనుకునే వాళ్లే ఇలాంటి వితండ వాదాలను ముందుకు తీసుకు వస్తారని అన్నారు పీకే. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మొత్తంగా నోరు మాయించాడు.
Also Read : Telangana Election Important Update : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
















