న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కీలక పోరులో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తనకు ఎదురే లేదని చాటింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ లోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టుకు చెందిన మాజీ స్కిప్పర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. తను కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొని 157 రన్స్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఐపీఎల్ హిస్టరీలో మరో రికార్డు నమోదు చేశాడు రాహుల్. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 264 రన్స్ చేసింది.
అందరూ ఈ భారీ టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఛేదించలేరని డిసైడ్ అయ్యారు. కానీ వరుస విజయాలతో దూసుకు పోతోంది పంజాబ్. ఆ జట్టు యువ ఆటగాళ్లతో పాటు కెప్టెన్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ తరుణంలో కీలకమైన పాత్ర పోషించాడు ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. కేవలం 26 బంతులు ఎదుర్కొని 76 రన్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ అయ్యర్ తగ్గరుండి గెలిపించాడు. కేవలం 36 బతులు ఎదుర్కొని 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 పోర్లు 7 సిక్సులు ఉన్నాయి. తర్వాత ప్రియాంశ్ ఆర్య 17 బంతులలో 2 ఫోర్లు 5 సిక్సులతో 43 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. అద్బుత విజయాన్ని నమోదు చేశారు.
















