హైదరాబాద్ : పాన్ ఇండియా సూపర్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషిస్తున్న చిత్రం స్పిరిట్. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. దీనిని అత్యంత ప్రతిస్టాత్మకంగా తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ కు ఉన్న మేనియా, స్టార్ డమ్ ను డిఫరెంట్ గా చూపిస్తానని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు. తను తీసిన యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు లో తను తీసిన అర్జున్ రెడ్డి ఇప్పటికీ సంచలనమే. ఈ తరుణంలో డార్లింగ్ ప్రభాస్ ను భిన్నమైన పాత్రకు ఎంపిక చేశాడు వంగా సందీప్ రెడ్డి. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశాడు శనివారం.
ఈ సినిమాను వచ్చే 2027 సంవత్సరంలో మార్చి 5వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని భద్రకాళి ఫిలింస్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సీరీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది స్పిరిట్ ను. ఇక ఇప్పటికే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మనోడు. రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లోనే అత్యంత తీవ్రమైన పాత్రలలో ఒకదానిని పోషించడానికి సిద్ధమవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చిత్ర నిర్మాతలు ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని సహజమైన, పవర్‌ఫుల్ అవతార్‌లో చూపిస్తూ ఒక శక్తివంతమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అప్పటి నుండి ఈ పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది.


















