Fish Venkat : హైదరాబాద్ – పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన తోటి నటుడు బాధలో ఉన్నాడని తెలుసుకుని స్పందించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 50 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించాడు. తనకు కిడ్నీ పాడై పోయింది. ప్రస్తుతం చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నాడు. ఎవరైనా సరే కిడ్నీ ఇచ్చే వారిని ఏర్పాటు చేసుకోవాలని కుటుంబీకులకు తెలిపాడు. అంతే కాదు తన వంతుగా ఎంతైనా సాయం చేస్తానని తెలిపాడు. ఆయన చేసిన ప్రకటన టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Hero Prabhas Financial Help to Fish Venkat
అనేక తెలుగు చిత్రాలలో హాస్య పాత్రలకు పేరు పొందాడు ఫిష్ వెంకట్ (Fish Venkat). ప్రస్తుతం తను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కూతురు స్రవంతి ఇటీవల అతని చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేసింది. తన తండ్రి పరిస్థితికి తక్షణ వైద్య సహాయం అవసరమని, ప్రస్తుతం అంత డబ్బులను తాము చెల్లించలేమని , దయకలిగిన వారు ఎవరైనా సరే సాయం చేయాలని కోరింది.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా తన వంతుగా భారీ సాయం ప్రకటించారు డార్లింగ్ ప్రభాస్. నటుడి వ్యక్తిగత టీం తన కుటుంబాన్ని పరామర్శించింది. ఫిష్ వెంకట్ కు అవసరమయ్యే అన్ని వైద్య ఖర్చులను తమ ప్రభాస్ భరిస్తాడని వారికి భరోసా ఇచ్చారు. తాజాగా ప్రభాస్ చేసిన ప్రకటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. దయ కలిగిన మానవుడు అంటూ పేర్కొంటున్నారు.
Also Read : Popular Peddamma Thalli Temple Story : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరీ ఉత్సవాల విశిష్టత



















