Speed Post : పోస్టల్ శాఖ ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) టారిఫ్‌లలో మార్పులు చేస్తూ, వినియోగదారుల కోసం పలు కొత్త సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి రానున్నాయి. 1986 ఆగస్టు 1న ప్రారంభమైన స్పీడ్ పోస్ట్, వేగవంతమైన మరియు నమ్మదగిన సేవలతో దేశవ్యాప్తంగా ప్రైవేట్ కొరియర్ సేవలకు బలమైన పోటీగా నిలిచింది.
స్పీడ్ పోస్ట్ (Speed Post) ఛార్జీలను చివరిసారిగా 2012 అక్టోబర్‌లో సవరించగా, 13 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త టారిఫ్‌లను ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, సాంకేతికతలో పెట్టుబడులు ఈ మార్పులకు కారణమని శాఖ తెలిపింది.
Speed Post – కొత్త ఫీచర్లు
- రిజిస్ట్రేషన్ సర్వీస్: పత్రాలు, పార్శిల్‌లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం. కేవలం చిరునామాదారు లేదా అతని ప్రతినిధికి మాత్రమే డెలివరీ. (రూ.5 + జీఎస్టీ)
- OTP డెలివరీ: చిరునామాదారు OTP ధృవీకరించిన తర్వాత మాత్రమే వస్తువులు అందజేయబడతాయి. (రూ.5 + జీఎస్టీ)
- విద్యార్థులకు తగ్గింపు: విద్యార్థులకు టారిఫ్‌పై 10% తగ్గింపు.
- SMS ఆధారిత నోటిఫికేషన్: డెలివరీ అప్‌డేట్‌లు SMS ద్వారా అందుతాయి.
- ఆన్‌లైన్ బుకింగ్: సులభమైన ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం.
- రియల్ టైమ్ ట్రాకింగ్: తక్షణ డెలివరీ అప్‌డేట్‌లు.
- అదనపు రిజిస్ట్రేషన్ సేవలు: వినియోగదారుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ సౌకర్యాలు.
కొత్త టారిఫ్ రేట్లు
0–50 గ్రాములు:
- స్థానికం: ₹19
- ఇతర ప్రాంతాలు: ₹47
51–250 గ్రాములు:
- స్థానికం: ₹24
- 200 కి.మీ వరకు: ₹59
- 201–500 కి.మీ: ₹63
- 501–1000 కి.మీ: ₹68
- 1000 కి.మీ పైగా: ₹77
251–500 గ్రాములు:
- స్థానికం: ₹28
- 200 కి.మీ వరకు: ₹70
- 201–500 కి.మీ: ₹75
- 501–1000 కి.మీ: ₹82
- 1001–2000 కి.మీ: ₹86
- 2000 కి.మీ పైగా: ₹93
వినియోగదారులకు మరింత విశ్వసనీయత, పారదర్శకత కల్పించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో స్పీడ్ పోస్ట్ సేవలను మరింత బలపరచడమే ఈ మార్పుల లక్ష్యమని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.
Also Read : Gold Price Drop : దీపావళి పండుగ నాటికి తగ్గనున్న పసిడి ధరలు



















