Poonam Kaur Shocking Comments : ప‌వన్..త్రివిక్ర‌మ్ పై పూనమ్ కౌర్ ఫైర్

మ‌రోసారి షాకింగ్ ట్వీట్ చేసిన న‌టి

Hello Telugu - Poonam Kaur Shocking Comments

Hello Telugu - Poonam Kaur Shocking Comments

Poonam Kaur : ప్ర‌ముఖ న‌టి పూన‌మ్ కౌర్ మరోసారి సంచ‌ల‌నంగా మారింది. త‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ , న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఎక్స్ వేదిక‌గా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్ట‌డంలో త‌న‌కు త‌నే సాటి అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ను ఏదైనా స‌రే ధైర్యంగా కామెంట్స్ చేస్తుంది. ఎవ‌రికీ భ‌య‌ప‌డే ర‌కం కాదు. త‌న‌ను వాడుకుని వ‌దిలి వేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ద‌ర్శ‌కుడు, న‌టుడి నిర్వాకంపై తెలుగు ఫిలిం పెద్ద‌ల‌కు చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ఇదేమి న్యాయం అంటూ ప్ర‌శ్నించింది.

Poonam Kaur Shocking Comments on Pawan Kalyan, Trivikram

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌దే ప‌దే వెన‌కేసుకు వ‌చ్చే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై ఫైర్ అయ్యింది పూన‌మ్ కౌర్ (Poonam Kaur). తాజాగా త‌ను న‌టించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీకి సంబంధించి ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. దీనిని మొద‌ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఉన్న‌ట్టుండి త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత నిర్మాత ఎంఎం ర‌త్నం గ‌త్యంత‌రం లేక త‌న సోద‌రుడి కొడుకు జ్యోతి కృష్ణ‌కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. చివ‌ర‌కు సినిమాను చాలా గ్యాప్ త‌ర్వాత నానా క‌ష్టాలు ప‌డి సినిమాను పూర్తి చేశాడు. ట్రైల‌ర్ తేదీల‌ను మార్చేశారు. విడుద‌ల తేదీల‌ను కూడా ముందుగానే ప్ర‌క‌టించిన నిర్మాత ఆ త‌ర్వాత మాట మార్చాడు.

ఇది ప‌క్క‌న పెడితే ఈ మొత్తం విష‌యాల‌ను ఏక‌రువు పెట్టింది న‌టి పూన‌మ్ కౌర్ (Poonam Kaur). త‌ను చేసిన ట్వీట్ లో ద‌ర్శ‌కుడు క్రిష్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌ను అద్భుత‌మైన క్రియేటివిటీ క‌లిగిన వ్య‌క్తి అంటూ పేర్కొన్నారు. అయితే ఇదే స‌మ‌యంలో పేర్లు ప్రస్తావించకుండా కాపీరైట్ వివాదాలు, పబ్లిసిటీ స్టంట్‌ల కోసం వార్తల్లో నిలిచే వ్యక్తులు స్థిరమైన విజయాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తారని ఎద్దేవా చేసింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై ఆమె ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Thalaivaa Coolie Rites Price : త‌లైవా కూలీ రికార్డ్ రూ. 80 కోట్ల‌కు ఓవ‌ర్సీస్ రైట్స్

Exit mobile version