త్రివిక్ర‌మ్ కామాంధుడు..కాలాంత‌కుడు : పూన‌మ్ కౌర్

ప‌ట్టించుకోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్

hellotelugu-PoonamKaur

ముంబై : సినీ న‌టి పూన‌మ్ కౌర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్, ఏపీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేసింది. ఇదే స‌మ‌యంలో త‌న‌ను ఎక్కువ‌గా స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్న ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు త్రివిక్రిమ్ శ్రీ‌నివాస్ ను ల‌క్ష్యంగా చేసుకుంది సినీ న‌టి. త‌న వ‌ల్ల ఎంతో మంది మ‌హిళ‌లు త‌మ జీవితాల‌ను నాశ‌నం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అంద‌రూ అనుకున్నంత అమాయ‌కుడు కాద‌ని, కామాంధుడే కాదు కాలాంత‌కుడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది పూన‌మ్ కౌర్. త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ను ఓ దారుణ‌మైన విల‌న్ అంటూ మండిప‌డింది. తాను రాసిన మాట‌లు వేరు చేసే చేత‌లు వేరంటూ పేర్కొంది. అంద‌మైన మ‌హిళ‌లు క‌నిపిస్తే చాలు సొల్లు కార్చుకుంటాడ‌ని, సినిమాల‌లో ఛాన్స్ లు ఇస్తానంటూ మోసానికి పాల్ప‌డ‌తాడ‌ని ఆరోపించింది.

మహిళలను మానసికంగా వేధించి, ఏమీ జరగనట్లుగా అతను తప్పించు కోగలడని నటి పూనమ్ కౌర్ సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా ఒక పోస్ట్ పెట్టింది. తాను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపింది. అంతే కాకుండా మీడియా సంస్థలు, ‘మా’ అసోసియేషన్ త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ కు సహాయం చేస్తున్నాయని వాపోయింది. అతని లాంటి వారిని ఎవరూ పట్టించు కోవడం లేదంటూ మండిప‌డింది. ఇలాంటి వ్యక్తులు మహిళలను వేధిస్తూ, మానసికంగా కుంగదీస్తున్నారని, చిన్న చిన్న విషయాలకు స్పందించే ‘మా’ అసోసియేషన్ ఇంతటి తీవ్రమైన అన్యాయాలపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని పూన‌మ్ కౌర్ ప్రశ్నించారు. త్రివిక్రమ్ చర్యలు తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరంగా, రాజకీయంగా దెబ్బ తీశాయని ఆమె గతంలో చాలాసార్లు ఆరోప‌ణ‌లు చేసింది న‌టి.

Exit mobile version