Pooja Hegde : హైదరాబాద్ : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే మరోసారి సంచలనంగా మారారు. పలు భాషలలో నటించి మెప్పించింది. ఇప్పటికే తను తమిళం, తెలుగు, హిందీ భాషలలో నటించింది. కొంత గ్యాప్ ఏర్పడినా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని తేలి పోయింది. దీంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది పూజా హెగ్డేకు (Pooja Hegde). తన తెలుగు పునరాగమన మూవీ ఎంటర్టైన్మెంట్ కోసం రూ. 3 కోట్లు అందుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ తో కలిసి భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్ లోకి తిరిగి రావడం ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. ఆమె ప్రజాదరణ, రేటింగ్స్ చెక్కు చెదరకుండా ఉండటంతో పూజ ఈ చిత్రంలో తన పాత్ర కోసం భారీ ఎత్తున పారితోషకం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
Pooja Hegde Popularity
ఆమె భావోద్వేగాలతో కూడిన పాత్రలను చేయడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే మూవీ మేకర్స్ తనను ఏరికోరి ఎంపిక చేసింది. ప్రస్తుతం పూజ కోలీవుడ్‌లో బిజీగా ఉండి, సూర్యతో రెట్రోలో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. అంతే కాదు సూపర్ స్టార్ విజయ్‌తో కలిసి జన నాయగన్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రజనీకాంత్ కూలీలో ఆమె ఇటీవల చేసిన ప్రత్యేక పాట మోనికా సాంగ్ దుమ్ము రేపింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున టాప్ లో కొనసాగుతోంది. గతంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోలతో నటించింది. పూజా హెగ్డే ప్రభాస్ , మహేష్ బాబు, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులతో నటించింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో జత కట్టింది.
Also Read : Minister Kandula Durgesh – AP Growth : విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాం

















