తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆఖరి ప్రసంగం చేయనున్నారు. నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. జయలలిత, ఎంజీ రామచంద్రన్ తర్వాత ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీసేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు విజయ్. తను టీవీకే పార్టీ పెట్టాడు. ఈ సందర్బంగా తను కీలక వ్యాఖ్యలు చేశాడు. తన రాజకీయ ప్రయాణం కేవలం ప్రజా సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగి పోతారన్న సూచనలను ఆయన తోసిపుచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం అభ్యర్థి విజయ్, తిరువళ్లూరులోని పాంచెట్టిలో రోడ్‌షో చేపట్టారు.
తమ పార్టీ విజిల్ గుర్తుకు మద్దతు ఇవ్వాలని కోరారు విజయ్. స్థిరపడిన పార్టీల నుండి వచ్చే రాజకీయ ఒత్తిడిని ప్రతిఘటిస్తామని హామీ ఇచ్చారు. ఓటర్లను తన సొంత బంధువులుగా సంబోధిస్తూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అందిస్తున్న నిరంతర మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. తనను తాను ప్రజా కేంద్రీకృత నాయకుడిగా అభివర్ణించుకుంటూ, తన పార్టీ రాజకీయ ప్రత్యర్థుల నుండి నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు మాపై వర్ణనాతీతమైన ఒత్తిళ్లు, ఆంక్షలు, హృదయ వేదనలను కలిగించిన వారు తప్ప మరెవరు? మా రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా వ్యతిరేక దుష్టశక్తులైన ద్రవిడ మున్నేట్ర కజగం, భారతీయ జనతా పార్టీ గురించి మా ప్రజలకు బాగా తెలుసు అని విజయ్ ఆరోపించారు.
