శరవేగంగా పోలవరం పనులు : నిమ్మ‌ల‌

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నీటి శాఖ మంత్రి

helloteluugu-Nimmala

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌ర‌వేగంగా పోల‌వ‌రం ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. 13 ఏళ్లక్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా పంటలు వస్తున్నాయని అన్నారు. 2019 తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వమే వచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రాంవాల్ కొట్టుకు పోయిందన్నారు. మళ్లీ పనులు వేగంగా చేస్తున్నాం అని, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం అని ప్ర‌క‌టించారు. బందరు పోర్టుకు 2014లో భూసేకరణ చేశామ‌న్నారు. 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం చేశారని ఆరోపించారు. బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా జరగుతున్నాయని తెలిపారు. 57 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

డిసెంబర్ కు బందరు పోర్టు పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నాం అన్నారు. విశాఖ తర్వాత అభివృద్ధి, ఆదాయంలో ముందు వరుస‌లో ఉండాల‌ని పేర్కొన్నారు. భారత్ మాలా పరియోజన కింద కేంద్రం రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ చేపడుతోందని అన్నారు. మచిలీపట్నం బై పాస్ రోడ్డు 2 లేన్ల నుంచి 6 లేన్లు చేస్తున్నారని, బీచ్ రోడ్డును విస్తరిస్తున్నార‌ని తెలిపారు. విజయవాడ నుంచి మచిలీపట్నంకు 6 లేన్ల రోడ్డుగా విస్తరణ జరుగుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ఎక్స్ ప్రెస్ హైవే వస్తోందని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే భూములు ఉండాలన్నారు. అమరావతి రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 29 వేల మంది 33 వేల ఎకరాలు అందించారని పేర్కొన్నారు.

Exit mobile version