Hans Raj : హిమాచల్ ప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ (Hans Raj) పై పోక్సో కింద కేసు నమమోదైంది. ఆయన గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతే కాదు మాజీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయనపై పలు లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ప్రేరేపిత కాల్స్ చేశారంటూ తనపై అభియోగం మోపారు. తన సహాయకుడిని కిడ్నాప్ చేయించాడని వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. మరో వైపు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
BJP MLA Hans Raj Pocso Case Filed
పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే హన్స్ రాజ్ మోసం చేశాడని, తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామన్నారు. అయితే తనపై కేసుతో పాటు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్. ఇది కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తనకు ఏ పాపం తెలియదని, తాను అన్నెం పున్నెం ఎరుగని అమాయకుడినని పేర్కొన్నాడు ఎమ్మెల్యే హన్స్ రాజ్. ఇదిలా ఉండగా బాధితురాలు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి. సంఘటన జరిగిన సమయంలో తాను మైనార్టీనని వాపోయింది. ఎమ్మెల్యే బూతు మెస్సేజ్ లు పంపించాడని, అంతే కాకుండా నగ్న ఫోటోలు పంపించాలని కోరాడని తెలిపింది.
Also Read : Gujarat ATS Shocking Updates : ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ : ఏటీఎస్
