PM Modi : ఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను సాధించి ఛాంపియన్లుగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో పాటు మేనేజ్మెంట్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi). పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అద్భుతమైన, మరిచి పోలేని రీతిలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. అసాధరణమైన రీతిలో ప్రతిభ కనబర్చారంటూ ప్రశంసించారు. విజయం సాధించినందుకు జట్టును ప్రధాని కొనియాడారు. ఇదిలా ఉండగా టోర్నీలో మూడు మ్యాచ్ లలో ఓటమి పాలై చివరకు ఎవరూ ఊహించని రీతిలో ఛాంపియన్లుగా నిలిచిన తీరు సర్వదా అభినందనీయమన్నారు నరేంద్ర మోదీ.
PM Modi Meet Indian Women Cricket Team
సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు, ఆ సమయంలో వారు ట్రోఫీ లేకుండానే ఆయనను కలిశారు, ఇప్పుడు వారు ట్రోఫీతో మోదీని కలిశారు. భారత జట్టు మహిళా సభ్యులతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని కొత్త ప్రపంచ ఛాంపియన్లతో దాదాపు రెండు గంటల పాటు సంభాషించారు. భారత దేశంలోని 143 కోట్ల మంది భారతీయులంతా మీకు జేజేలు పలికారని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
Also Read : DY CM Pawan Important Update : కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన



















