PM Modi : న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు. ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ను తప్పుపట్టారు. కాంగ్రె్ పార్టీ ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉంటుందని, కానీ తాము మాత్రం ప్రజల హృదయాలలో ఉంటామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ముందు పాకిస్థాన్ తేలి పోయిందన్నారు. మనం చేసిన దాడుల నుంచి పాక్ ఎయిర్ బేస్‌లు ఇంకా కోలుకోలేదన్నారు. ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. భారత్ ఎవరికీ తలవంచదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు మోదీ.
PM Modi Slams Pakistan
ఆపరేషన్ సిందూర్‌తో బ్లాక్ మెయిల్ పని చేయదని నిరూపించామని ప్రకటించారు. ఈ ఆపరేషన్ ద్వారా యావత్ ప్రపంచానికి భారతదేశం సత్తా ఏమిటో తెలిసి పోయిందన్నారు. మన సైన్యం సత్తా ఏంటో లోకం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిందన్నారు నరేంద్ర మోదీ (PM Modi). ఉగ్రవాదానికి ఊతమిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్థాన్‌కు అర్థమయ్యేలా చెప్పామన్నారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మన చర్యలను ఏ దేశం కూడా తప్పు పట్టలేదని అన్నారు. 193 దేశాల్లో కేవలం 3 దేశాలు మాత్రమే పాకిస్థాన్‌కు సపోర్ట్ చేశాయని చెప్పారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయిందన్నారు.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వల్ల 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోయిందని ఆరోపించారు పీఎం.. శ్రీలంకకు కచ్చతీవును ఇందిరా గాంధీ గిఫ్ట్‌గా ఇచ్చారంటూ మండిపడ్డారు. పీఓకేను ఎప్పుడు వెనక్కి తీసుకు వస్తారని అడుగుతున్నారని, ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగి పోలేదని ప్రకటించారు.
Also Read : Deputy CM Pawan Effective Orders : ఏనుగుల సంచారం పర్యవేక్షణ అవసరం
