PM Modi : కర్ణాటక – వందే భారత్ రైళ్లతో ప్రాంతీయ పరంగా కనెక్టివిటీ పెరుగుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెలగావి మార్గం కూడా ఉంది, ఇది ప్రయాణ సమయాన్ని గంటకు పైగా తగ్గిస్తుందన్నారు పీఎం. కొత్త సేవలు కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమైక్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయని స్పష్టం చేశారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బెంగళూరు-బెలగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించగా; శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా–అమృత్సర్, అజ్ని (నాగ్‌పూర్)–పుణే వందే భారత్ సేవలను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
PM Modi Key Updates on Vande Bharat
ఈ రైళ్లు ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగు పర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రధానమంత్రి, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొన్నారు మోదీ. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాని కాన్వాయ్ రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. కాగా బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలో నడుస్తున్న 11వ వందే భారత్ సర్వీస్ కావడం విశేషం.
కేవలం 8.5 గంటల్లో 611 కి.మీ.లను కవర్ చేస్తుంది. ఈ రెండు నగరాల మధ్య అత్యంత వేగవంతమైన రైలు, ఇది ప్రస్తుత సేవలతో పోలిస్తే కెఎస్ఆర్ బెంగళూరు నుండి బెళగావికి సుమారు 1 గంట 20 నిమిషాలు పడుతుంది. బెళగావి – కెఎస్ఆర్ బెంగళూరు నుండి 1 గంట 40 నిమిషాలు ఆదా చేస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Also Read : P Shiva Shankar Birth Anniversary Sensational : బహుజనుల బాంధవుడు శివ శంకర్
