PM Modi : బీహార్ : మహా కూటమి అంటేనే బీహార్ రాష్ట్ర ప్రజలు జంకుతున్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండో దశ ఎన్నికల్లో భాగంగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలి దశ పోలింగ్ ముగిసిందని, అత్యధికంగా ఓటు శాతం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్జీడే సారథ్యంలోని ప్రతిపక్షానికి ప్రజలు ఓట్లు వేయడం లేదని తేలి పోయందన్నారు నరేంద్ర మోదీ (PM Modi). భారత కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి మళ్లీ వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అందుకే వారిని నిర్ద్వందంగా తిరస్కరించారని తేలి పోయిందన్నారు . రాష్ట్రంలోని సీతామరి జిల్లాలో భారీ ర్యాలీ చేపట్టారు. తమ ఎన్డీయే సర్కార్ అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుందన్నారు.
PM Modi Shocking Comments on India Alliance
విద్య, వైద్యం, స్టార్టప్ లకు సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు నరేంద్ర మోదీ. ఆర్జేడీ తన ప్రచారంలో పిల్లలు పెద్దయ్యాక వీధి రౌడీలు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు 12 ర్యాలీలు, ప్రదర్శనలలో పాల్గొన్నానని చెప్పారు ప్రధాని. ఎక్కడికి వెళ్లినా ఎన్డీయే సెంటిమెంట్ కూడా కనిపించిందని చెప్పారు. గతంలో పాలకుల కంటే భిన్నంగా ప్రభుత్వ పనితీరు కనిపించిందన్నారు. కట్టా సర్కార్ కంటే మెరుగైన పాలనను అందిస్తున్న ఎన్డీయే సర్కార్ బెటర్ అని ఎంచుకుంటున్నారని, మరోసారి తమ ప్రభుత్వమే బీహార్ లో కొలువవు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Also Read : Kranthi Goud Sensational : క్రికెటర్ క్రాంతి గౌడ్ కు సర్కార్ ఘన సన్మానం
















