PM Modi Tour – Huge Security : ప్ర‌ధాని మోదీ టూర్ పై భారీ బందోబ‌స్తు

ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నంద్యాల ఎస్పీ

Hello Telugu - PM Modi Tour - Huge Security

Hello Telugu - PM Modi Tour - Huge Security

PM Modi : నంద్యాల జిల్లా : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న షెడ్యూల్ ఖ‌రారైంది. ఈ సందర్భంగా శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌. న‌రేంద్ర మోదీ (PM Modi) ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ప‌ర్య‌టిస్తారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించు కోనున్నారు. బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఇప్పటికే శ్రీశైల పరిసర ప్రాంతాలు, నల్లమల్ల అడవి ప్రాంతాలలో గ్రేహౌండ్స్ సాయిధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతోంద‌న్నారు ఎస్పీ.

PM Modi Nandyal Tour Updates

ప్రధాని పర్యటించే ప్రదేశాలలో గ హెలిపాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్, త‌దిత‌ర‌ ప్రాంతాలలో ఆదివారం ప‌ర్య‌టించారు. భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన‌ చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు నంద్యాల ఎస్పీ. ముందుగా ఢిల్లీ నుంచి నేరుగా నంద్యాల జిల్లాకు చేరుకుంటారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. అక్క‌డి నుంచి శ్రీ‌శైలంకు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా పూజ‌లు చేసిన అనంత‌రం క‌ర్నూల్ కు వెళ‌తారు. అక్క‌డ సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ పేరుతో నిర్వ‌హించే స‌భ‌లో పాల్గొంటారు. అక్క‌డి నుంచి ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి ఢిల్లీకి వెళ‌తారు.

Also Read : TPCC Chief Mahesh Kumar Shocking Comments : దేశ చరిత్రలో ఆర్టీఐ చారిత్రాత్మక నిర్ణయం

Exit mobile version