Ram Charan : ఢిల్లీ : ప్రముఖ నటుడు రామ్ చరణ్ (Ram Charan), భార్య ఉపాసన కొణిదల మర్యాద పూర్వకంగా న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించారు మోదీ. ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం పట్ల సంతోషంగా ఉందన్నారు పీఎం. విలువిద్య వారసత్వాన్ని కాపాడు కోవడానికి, ప్రపంచ వ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి ఇది మా చిన్న అడుగు మాత్రమేనని పేర్కొన్నారు.
PM Modi Appreciates Hero Ram Charan
ఈ సందర్బంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా తాను అభినందనలు తెలియ చేస్తున్నానని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ అద్భుతమైన క్రీడలో ఇంకా చాలా మంది చేరుతారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఇటీవలే ఘనంగా నిర్వహించారు. ఇందుకు గాను రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేని , ఏపీఎల్ విజేత జట్టుతో మోదీని కలిశారు. ఇందులో భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా ఉన్నారు.
కాగా అనిల్ కామినేని నాయకత్వంలో ప్రారంభమైన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ దేశ వ్యాప్తంగా ఆర్చరీని పునరుద్ధరించడానికి, ప్రోత్సహించడానికి దోహద పడుతుందని స్పష్టం చేశారు. ఇది ప్రతిభావంతులైన ఆర్చర్లకు శిక్షణ ఇచ్చేలా చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి స్థిరమైన వ్యవస్థను నిర్మించడానికి పని చేస్తుందని తెలిపారు రామ్ చరణ్. ప్రధానిని కలవడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : MLA Harish Rao Strong Assurance : గల్ఫ్ కార్మికులకు హరీశ్ రావు భరోసా
