Pink Salt : మన ఆహారంలో ఉప్పు ఒక ముఖ్యమైన భాగం. కూరగాయలు వండడానికి, సలాడ్ రుచిని పెంచడానికి లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వంటకాల్లో రుచి కోసం ఉప్పును వాడుతాం. అయితే అధిక ఉప్పు, అంటే అధిక సోడియం తీసుకోవడం రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఉపయోగించడం మంచిదా అనే ప్రశ్నపై పరిశీలన అవసరం.
Pink Salt – పింక్ సాల్ట్ అంటే ఏమిటి?
పింక్ సాల్ట్ (Pink Salt), లేదా హిమాలయన్ సాల్ట్, హిమాలయాలకు సమీపంలోని ఉప్పు గనుల నుంచి తీస్తారు. దీని గులాబీ రంగుకు కారణం ఐరన్ ఆక్సైడ్ వంటి ఖనిజాలు. పోషకాహార నిపుణులు సూచించినట్టుగా, పింక్ సాల్ట్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడదు, అందువల్ల ఇది సహజంగా, అధిక ఖనిజాలతో ఉంటుంది.
White Salt – సాధారణ ఉప్పు
సాధారణ టేబుల్ సాల్ట్ ప్రాసెస్ చేసిన ఉప్పు. ఇందులో చాలా ఖనిజాలు తొలగించబడతాయి. యాంటీ-కేకింగ్ ఏజెంట్లు జోడిస్తారు. CDC ప్రకారం, ఒక టీస్పూన్ సాధారణ ఉప్పులో సుమారు 2400 mg సోడియం ఉంటుంది. US FDA సూచన ప్రకారం, రోజుకు 2300 mg కంటే తక్కువ సోడియం తీసుకోవడం మేలు.
ముఖ్య తేడాలు
- సోడియం క్లోరైడ్ శాతం: పింక్ సాల్ట్ 84–98%, సాధారణ ఉప్పు 97–99%.
- మూలం: సాధారణ ఉప్పు సముద్రపు నీరు లేదా ల్యాండ్ మైన్స్ నుంచి, పింక్ సాల్ట్ హిమాలయా ఉప్పు గనుల నుంచి తీస్తారు.
- ప్రాసెసింగ్: సాధారణ ఉప్పు ఎక్కువ శుద్ధి చేయబడుతుంది, అయోడిన్ జోడిస్తారు; పింక్ సాల్ట్ సహజంగా ఉంటుంది.
- ఖనిజాలు: పింక్ సాల్ట్‌లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి 84 కంటే ఎక్కువ ఖనిజాలు ఉంటాయి.
- రంగు, ఆకృతి: సాధారణ ఉప్పు తెల్లగా, సన్నగా; పింక్ సాల్ట్ గులాబీ, కొంచెం దొడ్డుగా ఉంటుంది.
- రుచి: సాధారణ ఉప్పు ఎక్కువ ఉప్పుగా ఉంటుంది; పింక్ సాల్ట్ తేలికపాటి, ఖనిజ రుచి కలిగి ఉంటుంది.
- ఆరోగ్య ప్రయోజనాలు: సాధారణ ఉప్పు అయోడిన్ లోపాన్ని నివారించడంలో, పింక్ సాల్ట్ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌కి సహాయపడుతుంది.
ఏది ఎంచుకోవాలి?
రెండు ఉప్పులూ ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. యోడిన్ అవసరమైతే సాధారణ ఉప్పు, సహజ ఖనిజాలు మరియు ప్రత్యేక రుచి కావాలంటే పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. అయితే, ఏదైనా ఉప్పును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Pumpkin Interesting Benefits : గుమ్మడి కాయ ఒక్కటే కాదు గుమ్మడి పువ్వుతో కూడా ఎన్ని లాభాలో



















