ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయని, అవన్నీ చట్ట పరంగా లోబడి నమోదు చేసుకున్నాయని ఆ విషయం మాత్రమే తాను తమ రాష్ట్రంలో ఉన్నఆర్ఎస్ఎస్ సంస్థ గురించి వివరాలు మాత్రమే అడిగామని అన్నారు. ఇంతకంటే తాను అప్రజాస్వామికంగా ఒక్క పదం కూడా సంస్థకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. ఆ విషయం గురించి ఆర్ఎస్ఎస్ , బీజేపీ, దాని అనుబంధ సంస్థల నేతలందరూ తనను లక్ష్యంగా చేసుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని చెప్పారు ప్రియాంక్ ఖర్గే.
ఇప్పటికీ కూడా నేను ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని కోరడం లేదని స్పష్టం చేశారు. వారు తమ సంస్థను నమోదు (register) చేసుకోవాలని మాత్రమే కోరుతున్నానని తెలిపారు. తమ రాష్ట్రం కర్ణాటకలో 20 లక్షల మంది సమావేశమవుతున్నారని, దానికి హోం శాఖ నుంచి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలని తమను కోరారని ఆ విషయంలో మీరు ఎవరు, ఏం చేస్తుంటారు..? మీ సంస్థకు ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి వివరాలు మాత్రమే అడిగామని, ఇందులో తప్పు ఏముందని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ఈ సందర్బంగా తాను ఆర్ఎస్ఎస్ ను అసలు మీరు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, మీకు నిధులు ఎలా సమకూరుతాయి అనే విషయాలు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ తెలుసుకునే, ప్రశ్నించే హక్కు రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉందన్నారు. నేను అడిగేది ఇంతే. మీరు నమోదు చేసుకోండి, అప్పుడు మీకు రెట్టింపు భద్రతా ఏర్పాట్లు కల్పిస్తాను. ఒకవేళ మీరు నమోదు చేసుకోకపోతే, నేను దాని గురించి ఎందుకు పట్టించు కోవాలంటూ సీరియస్ అయ్యారు ప్రియాంక్ ఖర్గే.
















