OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్న ఓజీ (OG) చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా తను నటించిన హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. ఈ ఏడాదలో మరో రెండు మూవీస్ పై ఎక్కువగా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. దాదాపు ఓజీ మూవీ పూర్తి కావచ్చినట్లు టాక్. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ ఇస్తుండడంతో అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. తను ఇచ్చే బీజీఎం ఓ రేంజ్ లో ఉంటుంది.
Pawan Kalyan OG Movie 1st Single
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎడ తెరిపి లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కీ రోల్స్ పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ తో కలిసి. తాజాగా ఓజీ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. వచ్చే ఆగస్టు తొలి వారంలో లేదా రెండో వారంలో కానీ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని టాక్. విచిత్రం ఏమిటంటే ప్రముఖ తమిళ సినీ నటుడు శింబు అలియాస్ సిలాంబరసన్ పాడారు. అన్నీ ఓకే గనుక అయితే ఆగస్టు 1వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు సినీ వర్గాల భోగట్టా.
ఇక చిత్ర విషయానికి వస్తే ఓజీని మనసు పెట్టి తీశాడు దర్శకుడు సుజీత్. ఈ సినిమాను గ్యాంగ్ స్టర్ యాక్షన్ నేపథ్యంగా తెరకెక్కించాడు. ఓజాస్ గంభీర్ అనే శక్తివంతమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో తొలిసారిగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ తో పాటు అందాల తార శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Hero Mahesh Babu – Murali Mohan : జయభేరి ఆర్ట్స్ చిత్రాలలో అతడు టాప్
