హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణపై నోరు పారేసుకున్నారు. ఆపై మీ అయ్య జాగీరా అంటూ మండిపడ్డారు. తెలంగాణ వాదులను మరింత రెచ్చగొట్టేలా ఆయన కామెంట్స్ చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఉన్నట్టుండి తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయా పరిస్థితులు, పరిణామాలపై కూడా స్పందించాడు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి జీవం పోసిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై ఉన్నట్టుండి గత ఎన్నికల్లో తనను పక్కన పెట్టింది పార్టీ హైకమాండ్.
దీంతో ఎవరూ ఊహించని విధంగా తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆపై కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. అయితే బీజేపీని నమ్మని తమిళుల కోసం తనతో రాజీనామా చేయించి కొత్త పార్టీ పెట్టించేందుకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇలా ప్లాన్ చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కె. అన్నామలై రాజీనామా పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని , ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా ఏమీ కాదన్నారు. బీజేపీ అనేది పెద్ద సముద్రం అని, ఒకరు వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు డిప్యూటీ సీఎం. ఏ ప్రాంతీయ పార్టీని కూడా మీరు బీజేపీతో పోల్చలేరు. వారికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతంతో మమేకమై, దానిని ముందుకు తీసుకు వెళుతున్నంత కాలం, అది మంచిదేనని నేను భావిస్తానని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆ పార్టీని వీడితే, అది వారి ఇష్టానికే వదిలి వేస్తానని స్పష్టం చేశారు.
