Hero Pawan Kalyan-Trivikram : త్రివిక్ర‌మ్ దేవుడు ఇచ్చిన వ‌రం

ప్ర‌శంస‌లు కురిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Hello Telugu - Hero Pawan Kalyan-Trivikram

Hello Telugu - Hero Pawan Kalyan-Trivikram

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించే వ్య‌క్తి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అని అన్నారు. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో పాల్గొని ప్ర‌సంగించారు.
కష్టాల్లో నాకు అండగా నిలిచిన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ అన్నారు. దేశ ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి నుంచి నాకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని, కానీ దాని వల్ల డబ్బులు రావన్నారు. అభిమానుల్ని ఆనందింప చేసేందుకే ఈ సినిమా చేశాన‌ని చెప్పారు.

Pawan Kalyan Praises Trivikram Srinivas

ఖుషీ లాంటి సినిమా తీసిన‌ ఎ.ఎం. రత్నం ఇప్పుడు ఈ సినిమా తీశారు. ఎప్పుడూ రీమేక్ లు చేస్తావని అంతా నన్ను తిడతారు. మనకేమీ పెద్ద పెద్ద దర్శకులు లేరు. రీమేక్ చేస్తే పని అయిపోతుంది డబ్బు వస్తాయనే ఆలోచించారు. నేను ఒక్క ఫ్లాప్ ఇస్తే ఆ తర్వాత సినిమాపై నాకు గ్రిప్ దొరకలేదు. అలాంటి సమయంలో ఒక్క త్రివిక్రమ్ నాకు అండగా నిలబడ్డారు. అపజయాలు నన్ను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు ఆయన. కష్టాల్లో ఉన్న సమయంలో నాతో జల్సా చేసి హిట్ ఇచ్చారు. త్రివిక్రమ్ రూపంలో భగవంతుడు నాకు మంచి మిత్రుడిని ఇచ్చాడని ప్ర‌శంసించారు.

కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా, అది పోతే అందరం ఇబ్బంది పడతాం. పార్టీ నడపాలి, కుటుంబాన్ని పోషించాలి. అందుకే రీమేకల్ లకు ప్రాధాన్యత ఇచ్చాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan). ఎప్పటికైనా మంచి సినిమాలు చేయాలని కోరుకున్నా. ఆ సమయంలో ఎ.ఎం. రత్నం ద్వారా ఆఫ‌ర్ వచ్చిందన్నారు. ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ కు కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని అన్నారు. ఈ చిత్రం మీద రెండు సార్లు కరోనా ప్రభావం పడిందన్నార‌. సినిమా ముందుకు వెళ్తుందా లేదా అన్న నిరుత్సాహం నాలో వచ్చినప్పుడల్లా కీరవాణి సంగీతం తిరిగి ఉత్సాహం నింపేలా చేసింద‌న్నారు.

Also Read : Hero Pawan Kalyan : సగటు మనిషిగా బతకడమే నాకిష్టం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Exit mobile version