Pawan Kalyan : హైదరాబాద్ – నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయ లేదని స్పష్టం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సగటు మనిషిగా బతకడమే నాకిష్టం అన్నారు. గత ప్రభుత్వం బీమ్లా నాయక్ చిత్రం టిక్కెట్ ధర రూ. 10కి తగ్గించిందన్నారు. అప్పుడు ఒక్క పిలుపుతో అభిమానులు అండగా నిలిచారని అన్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డుల కోసం ప్రయత్నమూ చేయ లేదన్నారు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని చెప్పారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా రాజకీయాల్లో పడి లేచినా అందుకు అభిమానులే కారణమన్నారు.
Pawan Kalyan Key Comments
ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). మొఘలుల కాలంలో హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర ఇదని అన్నారు. కృష్ణా నది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం మొఘల్ సుల్తాన్ ల వరకు ఎలా చేరిందనేది చిత్రంలో చూపించినట్టు తెలిపారు.
చాలా క్లిష్ట మైన పరిస్థితుల్లో హైదరాబాద్ లో హరిహర వీరమల్లు ఫంక్షన్ చేసుకుంటున్నాం. లక్షలాది మంది మధ్య జరుపుకోవాలని భావించినా వర్షాల కారణంగా వేడుకను శిల్ప కళా వేదికకి పరిమితం చేయాల్సి వచ్చింది. ఇలాంటి వేడుకలు జరుపు కోవాలంటే చాలా ఒత్తిడులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వేడుకకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, పోలీస్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుడిని సంపాదించుకన్నా. ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అన్నారు. నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను అంటే కారణం అభిమానులే. పడి లేచి పడి లేచినా దానికి కారణం మీరే. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు. నా గుండెల్లో అభిమానులే ఉన్నారని అన్నారు.
Also Read : Supreme Court Shocking Comments : ఓటరు గుర్తింపు, రేషన్ కార్డు పౌరసత్వానికి రుజువు కాదు
