Hero Pawan Kalyan-OG : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సెప్టెంబ‌ర్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల

hellotelugu-pawankalyanog

OG : ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పారు ఓజీ (OG) మూవీ మేక‌ర్స్. ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఇప్ప‌టికే త‌ను న‌టించిన మ‌రో చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సైతం ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. త‌ను ఫుల్ ఫోక‌స్ అంతా డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తీస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై పెట్టాడు. ఇందులో త‌న స‌ర‌స‌న అందాల ముద్దుగుమ్మ శ్రీ‌లీల తెర పంచుకుంటోంది.

Pawan Kalyan OG Movie Updates

ఇప్ప‌టికే పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇక హ‌రీశ్ శంక‌ర్ అంటేనే ముందుగా గుర్తుకు వ‌చ్చే మూవీ గ‌బ్బ‌ర్ సింగ్. హిందీలో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ద‌బాంగ్ కు రీమేక్ అయినా ఎక్క‌డా అలాంటి ఛాయ‌లు లేకుండా తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ కెరీర్ లోనే అతి పెద్ద బిగ్ హిట్ గా నిలిచింది. ఇక పోతే హ‌రీశ్ శంక‌ర్, ప‌వ‌న్ కాంబినేష‌న్ లో మ‌రో మూవీ కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఈ త‌రుణంలో తాజాగా ఓజీ మూవీ గురించి ఎప్పుడు వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న‌కు తెర దించారు. ఈ మేర‌కు కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల 25వ తేదీన ముహూర్తం ఖ‌రారు చేశామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఇప్ప‌టికే ఈ ఓజీ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త‌న‌కు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోయే గుణం ఉంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు. ఈ సంద‌ర్బంగా ఫినిష్డ్ ఫైరింగ్ స్టార్ట్ అంటూ ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు ఓజీ డైరెక్ట‌ర్. ఇది కెవ్వు కేక అనేలా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ఇమ్రాన్ హ‌ష్ఈ, ప్రియాంక అరుల్ మోహ‌న్, ప్ర‌కాశ్ రాజ్, శ్రియా రెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌గా డీవీవీ దాన‌య్య‌, క‌ళ్యాణ్ దాసరి నిర్మించారు.

Also Read : Delhi Building Collapse : ఢిల్లీలో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం

Exit mobile version