Vijay Deverakonda – Kingdom Success : కింగ్ డ‌మ్ స‌క్సెస్ దేవ‌ర‌కొండ ఖుష్

సుకుమార్ కాంప్లిమెంట్స్ పై హ్యాపీ

Hello Telugu - Vijay Deverakonda - Kingdom Success

Hello Telugu - Vijay Deverakonda - Kingdom Success

Kingdom : సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కింగ్ డ‌మ్. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌ట్లో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత పుంజుకుంది. ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ఓవ‌ర్సీస్ లో కూడా క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్బంగా కింగ్ డ‌మ్ (Kingdom) లో కీ రోల్ పోషించిన న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. మీడియాతో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. త‌మ‌కు ముందు నుంచి క‌థ మీద న‌మ్మ‌కం ఉంద‌ని, ఇప్ప‌టికే జెర్సీ మూవీతో త‌న స‌త్తా చాటుకున్న సూరి ఇందులో త‌న‌ను ప్ర‌త్యేకంగా చూపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని కితాబు ఇచ్చాడు. నాతో పాటు స‌త్య దేవ్, భాగ్య శ్రీ బోర్సే సైతం సూప‌ర్ గా న‌టించార‌ని, వారి స‌హ‌కారం మ‌రిచి పోలేన‌ని చెప్పాడు రౌడీ.

Kingdom Movie Updates

అంతే కాదు కింగ్ డ‌మ్ కు మ్యూజిక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇచ్చిన మ్యాజిక్ లా ప‌ని చేసింద‌న్నాడు. ప్ర‌త్యేకించి సినిమాకు బీజీఎం ప్ల‌స్ పాయింట్ అయ్యింద‌ని చెప్పాడు. సినీ రంగానికి చెందిన ప‌లువురు కింగ్ డ‌మ్ బాగుంద‌ని, త‌న న‌ట‌న సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చార‌ని తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇదే స‌మ‌యంలో తాను ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాన‌ని, ఎందుకంటే మ‌లయాళంలో కింగ్ డ‌మ్ కు భారీ ఆద‌ర‌ణ వ‌స్తోంద‌న్నారు. అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు తాను ధ‌న్యవాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నాడు. పెళ్లి చూపులు త‌ర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు దేవ‌ర‌కొండ‌. సినిమా స‌క్సెస్ అయితే తాను సెల‌బ్రేట్ చేసుకోనంటూ స్ప‌ష్టం చేశాడు. ఇదే స‌మ‌యంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుకుమార్ కింగ్ డ‌మ్ బాగుందంటూ కితాబు ఇచ్చాడ‌ని, త్వ‌ర‌లోనే సినిమా అనేది చేస్తానో తెలియ‌ద‌ని అన్నాడు.

Also Read : Hero Balakrishna – Anil Ravipudi : బాల‌య్య మూవీపై అనిల్ రావిపూడి కామెంట్స్

Exit mobile version