Pawan Kalyan Interesting Comments : నాగ‌బాబు మంత్రి ప‌ద‌విపై చ‌ర్చించ లేదు

ఏపీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Pawan Kalyan Interesting Comments

Hello Telugu - Pawan Kalyan Interesting Comments

Pawan Kalyan : అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న సోద‌రుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్సీగా ఉన్న నాగ‌బాబు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వ‌డంపై ఇప్ప‌టి దాకా చ‌ర్చించ లేద‌ని స్ప‌ష్టం చేశారు. చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. అయితే జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటి వరకు తాను దృష్టి పెట్టలేదని స్ప‌ష్టం చేశారు.

Pawan Kalyan Comments about Nagababu

ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపై పని చేస్తాన‌ని చెప్పారు. రాజధాని భూ సేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వాల‌ని, బలవంతం లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు భూములు ఇవ్వాలంటూ తాము ఏనాడూ ఇబ్బందుల‌కు గురి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇక త‌న సోద‌రుడు నాగ బాబు గురించి ప‌దే ప‌దే మంత్రి ప‌ద‌వి ఇస్తారా లేదా అని పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. దానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం.

దానిపై తానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లోనే కేబినెట్ లో , సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ప్ర‌ధానంగా పోస్ట్ గురించి చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. కాఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు మేలు చేకూర్చేలా కూట‌మి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు.

Also Read : CM Revanth Reddy Sensational : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి రికార్డ్

Exit mobile version