Hari Hara Veera Mallu : హైదరాబాద్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన హరి హరి వీరమల్లు చిత్రం ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్ లోని విమల్ టాకీస్ లో చిత్ర బృందం రిలీజ్ చేసింది. మొత్తం ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాలలో 50 థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేయగా పవర్ , మెగా స్టార్ ఫ్యామిలీకి చెందిన అభిమానులు సంబురాలలో మునిగి పోయారు. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ హంగామాతో హోరెత్తి పోయింది. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ట్రైలర్ తేదీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సినిమా వస్తుందో రాదోనన్న టాక్ కూడా జరిగింది.
Hari Hara Veera Mallu Trailer Released
వీటన్నింటికి తెర దించుతూ హరి హర వీరమల్లు చిత్ర నిర్మాత ఎంఎం రత్నం సంచలన ప్రకటన చేశారు. పవర్ స్టార్ మూవీ రాక తప్పదని, ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. ప్రత్యేకించి నిన్న విడుదల చేసిన తాజా పవన్ కళ్యాణ్ పోస్టర్ దుమ్ము రేపింది. హరి హర వీరమల్లుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఈ సినిమాకు మరో స్పెషల్ కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ పాటను కూడా పాడారు.
మరో వైపు సినిమాకు సంబంధించి మొదటిసారి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించగా అనుకోకుండా ఆయన అర్ధాంతరంగా తప్పుకున్నారు. ఆ తర్వాత గత్యంతరం లేక నిర్మాత తన సోదరుడి కొడుకు ను పెట్టి సినిమాను అయ్యిందనిపించారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది.
Also Read : Hero Pawan Kalyan – Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లుపై ఉత్కంఠ

















