Pawan Kalyan Important Comments on Diwali : దీపావ‌ళిని ప‌ర్యావ‌ర‌ణ హితంగా జ‌రుపు కోవాలి

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

Hello Telugu - Pawan Kalyan Important Comments on Diwali

Hello Telugu - Pawan Kalyan Important Comments on Diwali

Pawan Kalyan : అమ‌రావ‌తి : దీపావ‌ళిని ప్ర‌తి ఒక్క‌రు ప‌ర్యావ‌ర‌ణ హితంగా జ‌రుపు కోవాల‌ని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ (Pawan Kalyan). దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. దీప కాంతులతో శోభాయమానంగా సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ‌, దేశంలోని, విదేశాల‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉందన్నారు. ఈ పండుగ ఎంతో మ‌న‌కు నేర్పుతుంద‌న్నారు. స్ప‌ష్ట‌మైన జీవన శైలిని అర్థం చేసుకునేలా చేస్తుంద‌ని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Deputy CM Pawan Kalyan Key Comments on Diwali

చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వ‌హించు కోవ‌డం గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తోంద‌న్నారు డిప్యూటీ సీఎం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించార‌ని గుర్తు చేశారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటి వార‌ని తెలిపారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అంది పుచ్చుకోవాల‌ని కోరారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also Read : Minister Vasamsetti Great Wishes : దీపావళి పండుగ వెలుగులు నింపాలి

Exit mobile version