Hero Pawan Kalyan : మూవీస్ కంటే పాలిటిక్స్ కే ప్ర‌యారిటీ

స్ప‌ష్టం చేసిన న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్

Hello Telugu - Hero Pawan Kalyan

Hello Telugu - Hero Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను న‌టించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కోహినూర్ వజ్రం చుట్టూ సినిమా క‌థ న‌డుస్తుంద‌న్నారు. ఔరంగజేబు అరాచకాలను ఎదిరించే పాత్ర‌లో తాను న‌టించాన‌ని, ఈ సినిమాను ఆద‌రించాల‌ని కోరారు. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్క్ అవుట్ చేశామ‌న్నారు. సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని, అయితే ప్ర‌స్తుతం తాను మూవీస్ కంటే పాలిటిక్స్ కే ప్ర‌యారిటీ ఇస్తాన‌ని చెప్పారు.

Hero Pawan Kalyan Comments

ప్ర‌ముఖ నిర్మాత ఎంఎం ర‌త్నం భారీ బ‌డ్జ‌ట్ తో నిర్మించారు హ‌రి హ‌ర వీర‌మల్లు మూవీని. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) తో పాటు నిధి అగ‌ర్వాల్ న‌టించింది. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. జ్యోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చాలా గ్యాప్ త‌ర్వాత సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 24న‌. బుధ‌వారం ప్రీమియ‌ర్ షో ప్ర‌ద‌ర్శిస్తారు.

ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంద్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ప్ర‌భుత్వాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఫేవరేట్ గా నిర్ణ‌యం తీసుకున్నారు. భారీ ఎత్తున టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు అనుమ‌తి ఇచ్చారు. వాస్త‌వానికి హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఎప్పుడో రావాల్సి ఉంది. దీనిని మొద‌ట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్రారంభించారు. కానీ ఎందుక‌నో తాను దీనిని వ‌దిలేసి పోయాడు. ఈ స‌మ‌యంలో నిర్మాత త‌న సోద‌రుడు త‌న‌యుడైన జ్యోతికృష్ణ‌కు సినిమా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడు. చివ‌ర‌కు ప‌డుతూ లేస్తూ సినిమా ముందుకు వ‌చ్చింది.

Also Read : Hero Dhanush-Kuberaa Piracy : కుబేర సినిమా పైర‌సీ సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు

Exit mobile version