Pawan Kalyan : అమరావతి : హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ ఘటనలో ఇప్పటికే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం.
Deputy CM Pawan Kalyan Assurance
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఘటన 24 వ తేదీ అర్ధరాత్రి 3 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో జరిగింది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బస్సుకు నిప్పులు అంటుకున్నాయి. చూస్తూ ఉండగానే బస్సు దగ్ధమైంది. మొత్తం ఈ బస్సులో 41 మంది ప్రయాణిస్తుండగా 20 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది సురక్షితంగా బయట పడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Also Read : CM Revanth Reddy Important Meeting : ప్రమాద ఘటనపై సీఎం ఆరా
