జగిత్యాల జిల్లా : ప్రసిద్ద పుణ్య క్షేత్రం కొండగట్టులో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ప్రముఖ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఉపీ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదల. తనకు ఆంజనేయ స్వామి అంటే నమ్మకం. ఈ సందర్బంగా తన కృషితో ఏకంగా ధర్మశాల నిర్మాణం కోసం టీటీడీ నుంచి రూ. 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు కూడా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరోసారి సినిమాలో నటిస్తున్నారు. చిత్రం పేరు ఉస్తాద్ భగత్ సింగ్.
ప్రస్తుతం ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్. ఇదే సమయంలో స్వామి వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా తన తరపున స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన మాటను నిలబెట్టుకున్నారు. తాను మాట తప్పనని నిరూపించుకున్నారు.



















