టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం..బ‌ల‌గం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి స‌విత

hellotelugu-SSavitha

గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీని నడిపేది కార్యకర్తలే అని, ఐవీఆర్ సర్వే ద్వారా కార్యకర్తలు మెచ్చిన నాయకులకే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా అవకాశం లభిస్తుందన్నారు మంత్రి స‌విత‌. సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, పాలిట్‌బ్యూరో సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, చైర్మన్‌లుగా ఎదిగే అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకే అగ్ర తాంబూలం వేస్తున్నారు యువ నాయకులు నారా లోకేశ్ అని అన్నారు మంత్రి . పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలకు మాత్రమే రాబోయే ఏ ఎన్నికలైనా ఎన్నికల్లో అయినా ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే నారా లోకేశ్ తేల్చి చెప్పారన్నారు.

తెలుగుదేశం పార్టీ ఓ పొలికల్ యూనివర్శిటీ .ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమందిని ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా, రాజకీయ ఉద్దండులుగా తీర్చిదిద్దిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ విషయం నేను గర్వంగా చెప్పగలను. ఒక సామాన్య కార్యకర్త అయిన శ్రీదేవికి పాలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారత మొదలైంది తెలుగుదేశం పార్టీతోనేని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్న నందమూరి తారక రామారావు స్థానిక సంస్థ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని గుర్తు చేశారు. మహిళలు రాజకీయ రంగాల్లో ఉండాలని ఎంతో మంది మహిళలు ప్రోత్సహించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆస్తుల్లో హక్కు కల్పించారు… మహిళా యూనిర్శిటీని స్థాపించి… మహిళా విద్యకు ప్రాధాన్యమిచ్చారని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.

Exit mobile version