Pankaj Dheer Death : ప్ర‌ముఖ న‌టుడు పంక‌జ్ ధీర్ ఇక లేరు

మ‌హా భార‌త్ లో క‌ర్ణుడి పాత్ర‌కు పేరొందారు

Hello Telugu - Pankaj Dheer Death

Hello Telugu - Pankaj Dheer Death

Pankaj Dheer : ముంబై : బాలీవుడ్ చ‌లన చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన పంక‌జ్ ధీర్ (Pankaj Dheer) అనారోగ్యంతో బుధ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో గొప్ప న‌టుడిని కోల్పోయామ‌ని సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు పేర్కొన్నారు. పంక‌జ్ ధీర్ దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇండియాలో అత్య‌ధిక వీక్ష‌ణ‌లు పొందిన మ‌హా భార‌త్ లో త‌ను క‌ర్ణుడి పాత్ర‌ను పోషించారు. ఈ పాత్ర ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానాలను తెచ్చి పెట్టింది. గ‌తంలో త‌ను క్యాన్స‌ర్ వ్యాధికి గుర‌య్యాడు. పూర్తి చికిత్స తీసుకున్నాడు. కానీ అనుకోకుండా ఆ వ్యాధి తిరిగి రావ‌డంతో త‌ట్టుకోలేక పోయాడు పంక‌జ్ ధీర్.

Pankaj Dheer Death Viral

ఆ వ్యాధి కొన్ని నెలల క్రితం తిరిగి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని, దీనికి అతను పెద్ద శస్త్రచికిత్స కూడా చేయించు కున్నాడని తెలుస్తోంది. పంక‌జ్ ధీర్ ఇటు బుల్లి తెర‌తో పాటు వెండి తెర‌పై కూడా కీల‌క పాత్రలు పోషించాడు. తన‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. ధీర్ మరణం గురించి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సీఐఎన్టీఏఏ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా పంక‌జ్ ధీర్ ప‌ని చేశారు. ఆయ‌న చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని, ఆయ‌న మృతి యావ‌త్ బుల్లితెర‌, వెండి తెర‌కు తీర‌ని న‌ష్టం మిగిల్చింద‌ని పేర్కొన్నారు.

Also Read : Tamil Govt New Bill Shocking : హిందీ భాషా సినిమాలు..పాట‌లపై నిషేధం

Exit mobile version