టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ టీం వెల్ల‌డి

ప్ర‌క‌టించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)

hellotelugu-PakistanSquad

పాకిస్తాన్ : ఓ వైపు ఐసీసీని బెదిరించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ వ‌ర్క‌వుట్ కాలేదు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు. ఈఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. ఈ మేర‌కు తాము భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఆడ‌లేమంటూ ప్ర‌క‌టించింది. త‌ట‌స్థ వేదిక‌లలో ఆడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. ఇప్ప‌టికే బంగ్లాదేశ్ స‌ర్కార్ ఒప్పుకోక పోవ‌డంతో భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము భార‌త్ లో ఆడబోమంటూ ప్ర‌క‌టించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్. ఇక ఆదివారం పాకిస్తాన్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌బోయే త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. మొత్తం 15 మంది స‌భ్యుల‌ను ఖ‌రారు చేసింది.

పాకిస్తాన్ జ‌ట్టు గ్రూప్ – ఏ-లో ఉంది. ఫిబ్రవరి 7న కొలంబోలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. కాగా బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా టోర్నీని బహిష్కరించాలని బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన మునుపటి బెదిరింపును సమర్థవంతంగా తిప్పికొట్టింది ఐసీసీ. సెక్యూరిటీ కార‌ణంగా భారతదేశానికి వెళ్లడానికి నిరాకరించిన తరువాత ఐసీసీ బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్‌తో భర్తీ చేసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ గతంలో T20 షోపీస్ నుండి వైదొలగాలని సూచించారు. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారతదేశం, శ్రీలంకలో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో సల్మాన్ అలీ అఘా పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. జ‌ట్టు ఇలా ఉంది.

టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫే (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్) ,ఉస్మాన్ తారిక్ ఆడ‌నున్నారు.

Exit mobile version