అమెరికా : ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది పాకిస్తాన్ చేసిన కామెంట్స్ ను.
ఉగ్రవాద చర్యల పర్యవసానాలపై హెచ్చరించింది. ఉగ్రవాద దాడి 25వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న రెండు వారాలకే షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు .పాకిస్థాన్‌ను ఒక బొమ్మ ప్రభుత్వంగా అభివర్ణించింది. ఆ దేశం చేస్తున్నవన్నీ పచ్చి అబద్దాలేనని పేర్కొంది. గట్టిగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా కాశ్మీర్ అంశాన్ని మళ్లీ ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. 2025లో భారత్‌తో జరిగిన ఘర్షణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సకాలంలో జోక్యం గురించి మాట్లాడిన తర్వాత నిన్న రాత్రి భారత్ తన ‘బదులిచ్చే హక్కు’ను వినియోగించుకుంది.
ఈ సందర్బంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, మానవ విలువల గురించి కపట నీతి బోధనలను తాము ఒక ప్రభుత్వం నుండి విన్నామని వెల్లడించారు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే, అది సైన్యం యొక్క, సైన్యం ద్వారా, సైన్యం కోసం నడిచే ప్రభుత్వం కాబట్టి. వారి చేతిలో ఉన్న బొమ్మలు (ప్రతినిధులు) రావచ్చు, పోవచ్చు, కానీ అసలు అధికారం ఎవరి చేతిలో ఉందో మనకు స్పష్టంగా తెలుసు. పాకిస్థాన్ వాస్తవ స్వరూపం దాని 27వ రాజ్యాంగ సవరణలో, దాని అసలు పాలకుడికి కల్పించిన జీవితకాల రక్షణ లో కనిపిస్తుంది అని గహ్లోత్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రతినిధి అసత్యాలతో చిత్రీకరించే విధంగా కాకుండా, ఆ దేశాన్ని , దాని విధానాలను వాటి అసలు స్వరూపంలో ఈ సభ గుర్తిస్తుందని మాకు నమ్మకం ఉందని అన్నారు గెహ్లాట్. అబద్ధాలను ఏళ్ల తరబడి పదేపదే చెప్పినంత మాత్రాన అవి నిజం కావని గుర్తించాలన్నారు.


















