ఎట్ట‌కేల‌కు భార‌త్ తో ఆడేందుకు పాకిస్తాన్ రెడీ

యూట‌ర్న్ తీసుక‌కున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

hellotelugu-INDvsPAKT20

దుబాయ్ : ప్ర‌పంచ క్రికెట్ లో తీవ్ర సంచ‌ల‌నం రేపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణ‌యం. అంత‌కు ముందు భార‌త దేశంలో లా అండ్ ఆర్డ‌ర్ బాగో లేద‌ని ఆరోపిస్తూ , త‌మ ఆట‌గాళ్లు క్రికెట్ మ్యాచ్ ఆడ‌డం లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఆపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశ అధ్య‌క్షుడి అనుమ‌తి నిరాక‌రించ‌డంతో గ‌త్యంత‌రం లేక తాము భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆడబోమంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ కు మ‌ద్ద‌తుగా పాకిస్తాన్ కూడా ఇండియాతో తాము మ్యాచ్ ఆడేది లేదంటూ ప్ర‌క‌టించింది. దీంతో ఐసీసీ సీరియ‌స్ గా తీసుకుంది.

ఈ మేర‌కు పాకిస్తాన్ బోర్డుతో విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపింది. ఒక‌వేళ పాకిస్తాన్ గ‌నుక ఆడ‌క పోతే తిరిగి త‌మ‌కు రూ. 300 కోట్ల‌కు పైగా చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆయా స్పాన్స‌ర్డ్ కంపెనీలు వార్నింగ్ ఇచ్చాయి. ఐసీసీ ఒత్తిళ్లు ప‌ని చేశాయి. ఎట్ట‌కేల‌కు ఈనెల 15న శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో భార‌త జ‌ట్టుతో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌కటించింది పీసీబీ. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం మొదట బాయ్‌కాట్ ప్రకటించినప్పటికీ, ఐసీసీతో చర్చలు, బంగ్లాదేశ్‌తో సహా మిత్ర దేశాల విజ్ఞప్తులతో యు-టర్న్ తీసుకుంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలతో జట్టు ఆడాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది. ఇది క్రికెట్‌కు మంచి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version