Pakistan : అమెరికా : ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్తాన్ (Pakistan), అమెరికా చేస్తున్న ప్రకటనలకు స్ట్రాంగ్ గా జవాబు ఇచ్చింది భారత్. గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ దిగి వచ్చిందని, భారత్ ను వెంటనే యుద్దాన్ని ఆపాలని కోరిందన్నారు ఐక్య రాజ్య సమితి సమావేశంలో భారత దేశ శాశ్వత మిషన్ లో తొలి కార్యదర్శి గా పని చేస్తున్న పెటల్ గహ్లూట్ . రెండు సైన్యాల డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాత పాకిస్తాన్‌తో శత్రుత్వాల విరమణపై అవగాహన కుదిరిందని భారతదేశం స్థిరంగా పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పోరాటాన్ని విరమించాలని పాకిస్తాన్ సైన్యం తమకు విజ్ఞప్తి చేసిందన్నారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఏదైనా సమస్యలో జోక్యం చేసుకోవడానికి మూడవ పక్షానికి అవకాశం లేదని భారతదేశం పేర్కొంది.
Pakistan Demand
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ జనరల్ డిబేట్‌లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రసంగించిన తర్వాత పెటల్ గహ్లోట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నుండి అసంబద్ధమైన నాటకీయ ప్రదర్శనలు జరిగాయని ఆరోపించారు. తమ విదేశాంగ విధానంలో చాలా కీలకమైన ఉగ్రవాదానికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు . షరీఫ్ తన ప్రసంగంలో కాశ్మీర్ పరిస్థితిపై న్యూఢిల్లీని విమర్శించారు. ఇదే సమయంలో పీఎం షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేశారు. శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు దక్షిణాసియాలో యుద్ధాన్ని నివారించడానికి సహాయ పడ్డాయంటూ పేర్కొన్నారు. తనను అందుకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ నామినేట్ చేశామన్నారు .
Also Read : Ladakh Curfew Sensational : వాంగ్‌చుక్ అరెస్ట్ ఎఫెక్ట్ లేహ్ లో కర్ఫ్యూ
















