ఆప‌రేష‌న్ సిందూర్ పై అసిమ్ మునీర్ కామెంట్స్

దైవ నిర్ణ‌యం వ‌ల్ల‌నే ఆగిందన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్

hellotelugu-PakArmyChiefAsimMunir

పాకిస్తాన్ : న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ దేశ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో దైవిక సహాయం లభించిందని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్ రక్షణ దళాల అధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కొన్ని నెల‌ల త‌ర్వాత ప్ర‌స్తావించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండ‌గా ఆపరేషన్ సిందూర్ కింద ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై న్యూఢిల్లీ దాడులు చేసిన తర్వాత, మే నెలలో భారతదేశంతో జరిగిన సైనిక ఘర్షణ సమయంలో ఇస్లామాబాద్‌కు దైవిక సహాయం లభించిందని పేర్కొని వివాదాన్ని మ‌రింత రేకెత్తించారు.

అసిఫ్ మునీర్ ఈ నెల ప్రారంభంలో ఇస్లామాబాద్‌లో జరిగిన జాతీయ ఉలేమా సదస్సులో పాల్గొన్నారు. మ‌రోసారి త‌న ప‌ద‌విని కాపాడుకునేందుకు ఈ ర‌క‌మైన వివాదాస్ప‌ద‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్ప‌టికే త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి, మాజీ క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ , పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే ఖ‌తం చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీంతో ఖాన్ సోద‌రీమ‌ణులు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆ ప్లాన్ ను తాత్కాలికంగా విర‌మించుకున్న‌ట్లు టాక్. ప‌హ‌ల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉన్న‌ట్లు భార‌త్ ఆరోపించింది. అందుకే ఆప‌రేష‌న్ సిందూర్ చేపట్టింది.

Exit mobile version