Pak Minister Khawaja Asif Shocking Comments : భారత్ ను నామ రూపాలు లేకుండా చేస్తాం

నోరు పారేసుకున్న పాక్ రక్షణ మంత్రి

Hello Telugu - Pak Minister Khawaja Asif Shocking Comments

Hello Telugu - Pak Minister Khawaja Asif Shocking Comments

Khawaja Asif : పాకిస్తాన్ : ఆప‌రేష‌న్ సిందూర్ ముగిసినా ఇంకా దాయాది పాకిస్తాన్ కు బుద్ది రావ‌డం లేదు . ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ నోరు పారేసుకుంటే ఆయ‌న‌కు తోడుగా మరొక‌రు క‌లిశారు. దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు భార‌త దేశం గురించి. భార‌త ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన వార్నింగ్ కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాము ఏమీ చేతులు క‌ట్టుకుని లేమ‌న్నారు. దమ్ముంటే ఇప్పుడు పాకిస్తాన్ తో ఢీకొనాల‌ని స‌వాల్ విసిరారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుందంటూ హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా ఆర్మీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు పాకిస్తాన్ ను ఉద్దేశించి.

Pakistan Defence Minister Khawaja Asif Shocking Comments

పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపక పోతే అది ప్రపంచ పటంలో కనుమరుగు అవుతుందంటూ హెచ్చ‌రిక జారీ చేశారు. ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించామ‌ని, కానీ ఈసారి జ‌ర‌గ‌బోయే ఆప‌రేష‌న్ సిందూర్ -2 లో ఆ ఛాన్స్ ఉండ‌ద‌న్నాడు. నిట్ట నిలువునా పాకిస్తాన్ ను అడ్ర‌స్ లేకుండా చేస్తామ‌న్నారు జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది. దీంతో తీవ్రంగా స్పందించాడు దాయాది పాక్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్. పాకిస్తాన్ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు ఇండియాకు. తాము త‌ల్చుకుంటే భార‌త్ ను నాశ‌నం చేస్తామ‌ని అన్నాడు.

Also Read : Supreme Court Shocking Comments : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టుకు వెళ్లండి : సుప్రీంకోర్టు

Exit mobile version