హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా జీఎస్టీని ఎగ్గొట్టాడు. ఏకంగా రూ. 28 కోట్లు చెల్లించక పోవడంతో తనను అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్ట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. బస్సు టికెట్ల రూపంలో ప్రజల వద్ద నుండి 28 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ప్రభుత్వానికి కట్టకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ నైపథ్యంలో సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు జీఎస్టీ అధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై తనిఖీల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్( ఆరెంజ్ ట్రావెల్స్) ఎండీ సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తించారు. గత కొంతకాలంగా ఆరెంజ్ ట్రావెలర్స్ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచింది టీజీ జీఎస్టీ. ఈ తనిఖీల్లో విస్తుపోయేలా ఆధారాలు లభించాయి. తను కావాలని జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. పన్ను చెల్లించకుండా ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలతో సునీల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. తను ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. చివరకు అధికారం ఉంది కదా తనకు ఏమీ కాదని అనుకున్నాడు. చివరకు జైలు పాలయ్యాడు.
