వాషింగ్టన్ : ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్ సంచలన ప్రకటన చేసింది. ఐఫోన్ డ్యూయో’ కోసం లక్షకు పైగా యాప్‌లు ఆప్టిమైజ్ చేయబడ్డాయని వెల్లడించింది. ఈ ఫోల్డబుల్ పరికరంలో వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు డెవలపర్లు వేగంగా కృషి చేస్తున్నారు. ఐఫోన్ డ్యూయో’ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే, లక్షకు పైగా అప్లికేషన్లు దీనికి అనుగుణంగా సిద్ధమయ్యాయి. డెవలపర్లు ఈ ఫోల్డబుల్ డిజైన్‌కు అనుగుణంగా తమ యాప్‌లను ఎంత వేగంగా మారుస్తున్నారో ఇది తెలియ జేస్తోంది. అయితే ఈ అప్డేట్లు ‘ఐఫోన్ డ్యూయో’లోని రెండు డిస్‌ప్లేలపై సంతృప్తికరమైన అనుభవాన్ని అందించడానికి సరిపోతాయా లేదా అన్నది ఇంకా చర్చనీయాంశమే. ఐఫోన్ డ్యూయో స్ ఐఓఎస్ 27.1 వెర్షన్‌తో పనిచేస్తుంది. దీనిని విప్పినప్పుడు పెద్ద అంతర్గత స్క్రీన్ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు బ్రౌజింగ్ చేయడానికి, కంటెంట్ చూడటానికి , మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది.
అయితే సాధారణ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల కోసం రూపొందించిన యాప్‌లకు ఇది కొన్ని సవాళ్లను కూడా తెచ్చిపెడుతుంది. ఆపిల్ తెలిపిన వివరాల ప్రకారం డెవలపర్లు ప్రతిరోజూ వేలకొద్దీ యాప్‌లను అప్డేట్ చేస్తూ ఈ సవాళ్లను అధిగమిస్తున్నారు. ‘ది వెర్జ్’ నివేదిక ప్రకారం ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ రిలేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుసాన్ ప్రెస్కాట్ డెవలపర్ల నుండి లభించిన స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డెవలపర్లు ‘ఐఫోన్ డ్యూయో’ను ఎంత వేగంగా స్వీకరించారో చూడటం అద్భుతంగా ఉంది. వారి సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు తాము కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. యాప్ స్టోర్‌లో ఆప్టిమైజ్ చేయబడిన యాప్‌ల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, మరికొంత మంది డెవలపర్లు తమ సాఫ్ట్‌వేర్‌ను ఈ పరికరానికి అనుగుణంగా అప్డేట్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఎక్కువ యాప్‌లు అందుబాటులో ఉన్నంత మాత్రాన మెరుగైన అనుభవం లభిస్తుందని చెప్పలేం అన్నారు.
