Coolie: సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కూలీ. ఓవర్సీస్ లో ఇప్పటికే రూ. 80 కోట్లకు అమ్ముడు పోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఉపేంద్ర, అమీర్ ఖాన్ , అక్కినేని నాగార్జున, శ్రుతీ హాసన్ ముఖ్య పాత్రల్లో పోషించిన కూలీ చిత్రం ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా తొలిసారి రజనీతో నటించిన నాగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా సూపర్ స్టార్ సినీ కెరీర్ లో బాషా సెన్సేషన్ . దానిని కోట్ చేస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడని ఈ సందర్బంగా ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో ఒక కూలీ మూవీ 100 బాషాలతో సమానం అని స్పష్టం చేశాడు అక్కినేని నాగార్జున.
Nagarjuna – Coolie Movie
ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ కంటే ముందే సినీ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి. రజనీకాంత్ కెరీర్ లోనే కూలీ చిత్రం బిగ్ హిట్ కాబోతోందని అంచనా వేస్తున్నారు. ఏకంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తన సినిమా సక్సెస్ పక్కా అని ముందే ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇదిలా ఉండగా మరో కీ రోల్ పోషించిన అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను చూసిన దర్శకులలో లోకేష్ వెరీ వెరీ స్పెషల్ అని తెలిపాడు. అంతే కాదు భవిష్యత్తులో తను తప్పకుండా కనగరాజ్ తో సినిమా తీస్తానని ప్రకటించాడు.
ఇక సినిమాకు మరో హైలెట్ ఏమిటంటే అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్గే కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. లవ్ యూ మౌనికా అన్న సాంగ్ టాప్ చార్ట్ లో కొనసాగుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది.
Also Read : Hero Jr NTR War 2 : రిలీజ్ రాకుండానే వార్ -2 మూవీ రికార్డ్
