13న కామెడీ , వినోదాత్మ‌క చిత్రం డీఎన్కే మూవీ రిలీజ్

ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌

hellotelugu-DNKMovieTrialer

హైద‌రాబాద్ : శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ డీఎన్కే మూవీ ట్రైలర్‌ను ‘మాస్ మహారాజా’ రవి తేజ విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 13 థియేటర్లలో విడుదల కానుంది. గత ఏడాది ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ నటుడు మౌలి ఇప్పుడు ఈ డీఎన్కే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసి ప్రేక్షకులను ఉత్సాహ పరిచింది. ఈ ఫన్నీ ట్రైలర్‌ను ‘మాస్ మహారాజా’ రవి తేజ ఆవిష్కరించి, చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియ జేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్‌ను పంచుకుంటూ చిత్ర బృందం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.

మాస్ మ‌హారాజా మూవీ ట్రైల‌ర్ ను లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించేందుకు సిద్దంగా ఉండాల‌ని కోరింది మూవీ టీం. ట్రైలర్‌తో పాటు, రవి తేజ, డీఎన్కే బృందం కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా చిత్ర బృందం పంచుకుంది సోష‌ల్ మీడియా వేదిక‌గా. మౌలి ఎంతో సంతోషంగా కనిపిస్తూ మరోసారి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించేందుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఇందులో మౌలి పాత్రకు బెట్టింగ్ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. అతని ప్రేయసి అన్ని విధాలుగా అతనికి మద్దతు ఇస్తుండగా, అతను డబ్బు సంపాదించే క్రమంలో బ్యాంకును దోచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ట్రైలర్ చాలా హాస్యాస్పదంగా ఉండి, సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. దొంగతనాల నేపథ్యంలో సాగే ఈ డార్క్ కామెడీలో, మౌలి ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో సుస్మితా శెట్టి, బబ్లూ, అలీ, రఘు బాబు, భద్రం, రమణ భార్గవ, నంద గోపాల్, ప్రియ , రజిత కీలక పాత్రల్లో నటించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Exit mobile version