బెంగళూరు : స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం డ్రాగన్. సినిమా షూటింగ్ సందర్బంగా నటుడు గాయపడ్డారు. మాస్ మ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంతో ఈ నటుడు తదుపరి వెండితెరపై కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’ షూటింగ్ సుమారు రెండు వారాల్లో తిరిగి ప్రారంభం కానుంది. నిర్మాత మైత్రి రవిశంకర్ ప్రకారం చిత్ర బృందం ఫిబ్రవరి 2027 వరకు పెద్ద విరామాలు లేకుండా షూటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. తాజా అప్ డేట్ కూడా వచ్చింది ఈ మూవీ గురించింది.
డ్రాగన్ మూవీని వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు సినీ నిర్మాతలు. ఇదిలా ఉండగా ‘డ్రాగన్’ దేశభక్తి నేపథ్యంతో కూడిన ఒక హై-ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమ సుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా ఈ చిత్ర తారాగణంలో ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ సెట్స్‌పైకి తిరిగి రానున్న నేపథ్యంలో, ‘డ్రాగన్’ గురించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర తర్వాత వస్తున్న మూవీ కావడంతో మరింత ఉత్కంఠ నెలకొంది డ్రాగన్ పై.

















