యుగానికి ఒక్క‌డు ఎన్టీఆర్ : అనిత వంగ‌ల‌పూడి

పేద ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం అన్న హోం శాఖ మంత్రి

Hellotelugu-AnitaVangalapudi

అమ‌రావ‌తి : యుగానికి ఒక్క‌డు దివంగ‌త నాయ‌కుడు ఎన్టీఆర్ అని కొనియాడారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. కోటవురట్ల మండలం రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్బంగా అనిత ప్రసంగించారు. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రెండోసారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని పునరుద్ధరిస్తూ, రామచంద్రపురంలో రూ.1.16 కోట్లతో పలు పనులు చేపట్టడమే కాకుండా, పాయకరావుపేట నియోజకవర్గంలో నరేగా , R&B ద్వారా రూ.80 కోట్లతో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నామని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. దేశంలోనే అత్యధికంగా పించన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, త్వరలోనే స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమల స్థాపన ద్వారా ఈ ప్రాంత యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్ర‌క‌టించారు.

పందూర్ బ్రిడ్జి తరహాలోనే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కోటవురట్ల మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తులు తాతయ్య బాబు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు , జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గడ్డం బుజ్జి పాల్గొన్నారు.

Exit mobile version