Telangana : హైదరాబాద్ : ఓ వైపు హైకోర్టులో ఇంకా రిజర్వేషన్ల ఖరారుపై తుది తీర్పు రాకుండానే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23, 27న పోలింగ్ జరుగుతుందని ప్రకటించింది. అయితే హైకోర్టు వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర ఎన్నికల సంఘం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) , జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana Election Updates
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటటీసీ సభ్యులను ఎన్నుకోవడానికి అక్టోబర్ 23, 27 తేదీలను ఖరారు చేశామని తెలిపింది. ఈ రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొంది. . ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 31 జిల్లాలు, 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి, వీటిలో 565 జెడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందుకు గాను మొత్తం 31,300 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు . ఇక నామినేషన్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ మొదటి దశకు అక్టోబర్ 11 కాగా రెండవ దశకు అక్టోబర్ 15గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన వరుసగా అక్టోబర్ 12 , 16 తేదీలలో నిర్వహిస్తారు. మొదటి దశకు అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ 15 కాగా రెండవ దశకు అక్టోబర్ 19 అని తెలిపారు.
Also Read : BC Janardhan Reddy Important Update : ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడుల రాక
